ధురంధర్ 2కు మోస్ట్ అడ్వాన్స్ డ్ విషయం ఏంటంటే.. ఈ మూవీకి ప్రమోషన్స్ అస్సలు అక్కర్లేకుండా చూసుకున్నారు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కేవలం ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. అస్సలు మినిమం ప్రమోషన్స్ అంటూ ఏం లేవు. అయినా మూవీపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రీమియర్స్ కు అడ్వాన్స్ సేల్స్ లో ఏకంగా 100కోట్లు కొల్లగొట్టింది. ఈ రికార్డ్ క్రియేట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా కూడా ఈ మూవీ నిలిచింది. మరి ఆ స్థాయిలో ఉన్న మూవీపై ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం కూడా వెంటాడింది. అదేంటీ అంటే అసలు ఇప్పటి వరకు ఈ మూవీ సెన్సార్ పూర్తి కాలేదు కదా. మరెలా రిలీజ్ అనుకున్నారు. బట్ అలాంటిదేం లేదు. ఈ మూవీ సెన్సార్ ఇవాళ మధ్యాహ్నం తర్వాత పూర్తయింది.
ధురంధర్ 2కు సెన్సార్ బోర్డ్ నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇది మామూలుగా ముందు నుంచీ తెలిసిందే. అంచేత ఇందులో ఏ ఇబ్బందీ లేదు. ఏ సర్టిఫికెట్ అంటే సెక్సువల్ కంటెంట్ వల్ల కాదు. విపరీతమైన హింస కారణంగా వచ్చిందీ సర్టిఫికెట్. సినిమా నిడివి ఏకంగా 3 గంటల 50 నిమిషాలు ఉంది. అంటే దాదాపు నాలుగు గంటలు ఉండబోతోంది. ఇక ఈ మూవీకి మొత్తంగా లైన్ క్లియర్ అయింది. ఇక రిలీజ్ కు ఎలాంటి ఇబ్బందులు లేవు అనేది తేలిపోయింది. ఇక ఈ మూవీకి ఆదిత్య ధర్ డైరెక్ట్ చేశాడు. రణ్వీర్ సింగ్ హీరోగా అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ మూవీ కొత్తగా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయబోతుందో అనేది చూడాల్సిందే.