Kamal Haasan : భారతీయుడు 3 రాబోతోంది..

Update: 2025-07-16 10:45 GMT

లోక నాయకుడు కమల్ హాసన్ ఎపిక్ మూవీ భారతీయుడు. 1995లో వచ్చిన ఈ మూవీ అప్పట్లోనే ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అనిపించుకుంది. శంకర్ క్రియేట్ చేసిన ఈ మ్యాజిక్ కు బాక్సాఫీస్ సైతం షేక్ అయింది. ఓ రకంగా కమల్ కెరీర్ లో టాప్ టెన్ బెస్ట్ మూవీస్ లో నిలిచిపోతుంది. ద్విపాత్రాభినయంలో కమల్ వేరియేషన్స్, ఆ టైమ్ లోనే మేకప్ లో చూపించిన గ్రేట్ నెస్ సినిమాకు క్లాసిక్ గా నిలిపాయి. అలాంటి క్లాసిక్ అలాగే వదిలేయకుండా సెకండ్ పార్ట్ అంటూ మొదలుపెట్టారు శంకర్, కమల్. చాలామంది వారించారు కూడా. వీళ్లు వినలేదు. 2022లో ప్రారంభమై అనేక ప్రాబ్లమ్స్ తో ఆగుతూ, సాగుతూ చివరికి ఈ యేడాది విడుదలైంది. ఊహించినట్టుగానే డిజాస్టర్ అయింది. మరి ఇంతటితో వదిలేస్తున్నారా అంటే లేదు.. సెకండ్ పార్ట్ లో చూపించిన థర్డ్ పార్ట్ ను మళ్లీ స్టార్ట్ చేస్తున్నారు.

భారతీయుడు 3 సెట్స్ పైకి వెళ్లబోతోంది. అందుకు కారణం రజినీకాంత్ అంటోంది కోలీవుడ్. మరి ఆయన జోక్యం ఏంటో తెలియదు కానీ.. మొత్తంగా షూటింగ్ మాత్రం త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. స్టార్ట్ అయ్యే షెడ్యూల్ లో ఓ పాటతో పాటు కొన్ని సీన్స్ ను చిత్రీకరిస్తారట. ఈ పార్ట్ కోసం దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. ఈ పార్ట్ లో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. ఇప్పటికే మూడో భాగానికి సంబంధించి 70శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసి ఉన్నారు. అందుకే ఈ మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసి జనంపైకి వదలబోతున్నారు. మరి సెకండ్ పార్ట్ తో తిన్న షాక్ ను మూడో భాగం మరిపిస్తుందా.. కొనసాగిస్తుందా అనేది చూడాలి.

Tags:    

Similar News