తెలుగు నిర్మాతల మండలి పోలింగ్ ముగిసింది. నిర్మాతలు దామోదర ప్రసాద్, జెమిని కిరణ్ అధ్యక్ష బరిలో ఉన్నారు. కాగా.. నిర్మాతల మండలికి సాధారణంగా ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. కానీ.. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహిం చలేదు. దీంతో కొన్నిరోజుల క్రితం చిన్న నిర్మాతలు ఎలక్షన్స్ నిర్వహించాలని ధర్నాకి కూడా దిగారు. ఆ సమయంలో నిర్మాతల మండలిలో వివాదా లు చెలరేగాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఎట్టకేలకు నిర్మాణ సి.కళ్యాణ్ ఎలక్షన్స్‌ని ప్రకటించారు. ఇక ఈ ఎలక్షన్స్‌లలో దామోదర ప్రసాద్‌కు దిల్‌రాజు మద్దతిచ్చారు. ఇక జెమిని కిరణ్‌కు సి.కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. ఈ ఫలితాలు కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది.