టాప్ హీరోలు, బిగ్ బడ్జెట్ మూవీస్ కు షాకింగ్ న్యూస్. ఇప్పటి వరకూ తమ స్టార్డమ్ ను అడ్డు పెట్టుకుని.. భారీ బడ్జెట్ తో సినిమాలు చేశాం అంటూ తమ పలుకుబడితో ఇష్టం వచ్చినట్టుగా టికెట్ రేట్లు పెంచుకోవడమే కాక అదనపు ఆటలు పేరుతో అర్థరాత్రి నుంచే షోస్ ప్రదర్శించడం చేస్తున్న వారికి తెలంగాణ హై కోర్ట్ పెద్ద షాక్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం అర్థరాత్రి 1:30 నుంచి ఉదయం 8:40 మధ్య ఎలాంటి సినిమా ప్రదర్శనలు చేయడానికి వీళ్లేదని తేల్చి చెప్పింది కోర్ట్. అంటే ఇకపై బెన్ ఫిట్ షోస్ మాత్రమే కాదు.. ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా ఉండవన్నమాట. మల్టీ ప్లెక్స్ లు కూడా తమ షో టైమ్స్ ను సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఈ మేరకు టికెట్ ధరల పెంపును కూడా క్యాన్సిల్ చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్ట్ ను కోరాడు. దీంతో ఆ విషయాన్ని కోర్ట్ రివ్యూ చేస్తాం అని చెప్పింది. అలాగే తదుపరి వాదనలను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. ఈ లోగా వచ్చే పెద్ద సినిమాలు ఎర్లీ మార్నింగ్ షోస్ కోసం ప్రయత్నించొచ్చు అన్నమాట. కాకపోతే ఆ రేంజ్ మూవీస్ ఏం రాబోయే నెలలో కనిపించడం లేదు. సో.. కోర్ట్ తీర్పు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కానీ.. ఆ తీర్పును ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తే మాత్రం పెద్ద సినిమాలకు కలెక్షన్స్ పరంగా పెద్ద ముప్పే రాబోతోందనుకోవచ్చు.