మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సడెన్ గా సోషల్ మీడియాను హీటెక్కించాడు. తాజాగా దుబాయ్ మాగజిన్ కు ఇచ్చిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతన్ని ఇలాంటి లుక్ లో ఇప్పటి వరకూ ఎవరూ చూడలేదు. అంత స్టైలిష్ గా ఉన్నాడు. కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, లుక్స్.. అన్నీ ఆల్ట్రా మోడ్రన్ గా ఉన్నాయి. అయితే అంతకు ముందు నుంచే ఎన్టీఆర్ లైనప్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. దీనికి డ్రాగన్ అనే టైటిల్ పెడతారు అనే టాక్ ఉంది. ఇంకా టైటిల్ కన్ఫార్మ్ కాలేదు. మరి ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటీ అంటే సరిగ్గా ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందుకే ఎన్టీఆర్ లైనప్ గురించి డిస్కషన్ నడిచింది.
మామూలుగా అయితే ప్రశాంత్ నీల్ తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ మూవీస్ తో పాటు దేవర 2 కూడా చేయాల్సి ఉంది. వీటిలో ఏది ముందు మొదలవుతుందీ అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ మూడు చిత్రాల్లో ముందుగా స్టార్ట్ అయ్యేది దేవర 2ట. కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఒక నెల రెండు నెలల్లో బౌండ్ స్క్రిప్ట్ రెడీ అవుతుంది. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాడట. ఈ యేడాది చివర లేదా 2026 జనవరి వరకూ ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేస్తాడు ఎన్టీఆర్. ఆ వెంటనే ఫిబ్రవరి నుంచే దేవర 2 సెట్స్ పైకి వెళుతుందని టాక్. సో.. దేవర 2 తర్వాతే త్రివిక్రమ్ అయినా నెల్సన్ అయినా అనేది ప్రస్తుతానికి వినిపిస్తోన్న మాట. మరి ఈ ఆర్డర్ లో కూడా ఇంకేవైనా మార్పులు ఉంటాయా లేదా ఇదే అమలవుతుందా అనేది చూడాలి.