Upasana Instagram Post: రామ్ చరణ్ ఇంట్లో మెగా సందడి.. ముందే వచ్చిన క్రిస్మస్

Upasana Instagram Post: మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. మెగా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి.;

Update: 2022-12-21 07:42 GMT

Upasana Instagram Post: మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. మెగా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది కజిన్స్ సీక్రెట్ శాంతాగా మారి ఒకరినొకరు సర్‌ప్రైజ్ ఇచ్చుకున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన కొన్ని చిత్రాలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.


క్రిస్మస్ సందర్భంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ కజిన్స్‌తో కలిసి సీక్రెట్ శాంటా ఆటను ఆస్వాదించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, అల్లు స్నేహ రెడ్డి, నిహారిక కొణిదెల, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ ఇంకా చాలా మంది కనిపిస్తారు. ఫోటోను షేర్ చేస్తూ, ఉపాసన కొణిదెల, "మెగా కజిన్స్ #సీక్రెట్ శాంటా" అని రాశారు.


రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మొదటి బిడ్డ పుట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తను మెగాస్టార్ చిరంజీవి కొద్దిరోజుల క్రితం ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.. ఈ జంటకు పెళ్లై 10 ఏళ్లు. ఈ జంట ఓ కళాశాల ఈవెంట్‌లో కలుసుకున్నారు. వారి పరస్పర స్నేహితుల ద్వారా ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. వారి మొదటి సమావేశం లండన్‌లో జరిగింది, అక్కడ వారు స్పోర్ట్స్ క్లబ్‌లో మాట్లాడుకున్నారు. కొన్ని రోజుల డేటింగ్ తర్వాత జూన్ 14, 2012న పెళ్లి చేసుకున్నారు.

వర్క్ ఫ్రంట్‌లో, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్‌తో RC15 కోసం పని చేస్తున్నారు.

Tags:    

Similar News