NTR War2 : ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ పై ఇది క్లారిటీ అనకోవచ్చా..?

Update: 2025-08-02 07:15 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాప్ గేర్ లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్, దేవరతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. అతని బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరోవైపు ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్, దేవర 2, నెల్సన్ మూవీస్ వరుసగా లైన్ లో ఉన్నాయి. ఇక వార్ 2 విషయంలో ట్రైలర్ కు ముందు వరకూ చాలామందిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ను ట్రైలర్ క్లియర్ చేసింది. కొన్ని రోజుల క్రితం వార్ 2కు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల రెమ్యూనరేషన్స్ ఇవే అంటూ కొన్ని ఫిగర్స్ వచ్చాయి. వాటి ప్రకారం ఎన్టీఆర్ కు 60 కోట్లు అయితే హృతిక్ రోషన్ కు 30 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చాడు ఈ చిత్రానికి అని బాలీవుడ్ మీడియా కూడా రాసుకుంది. అయితే ఎన్టీఆర్ కు హృతిక్ కు ఎలా ఎక్కువిస్తారు అని కొందరు ట్రోల్స్ చేశారు. బట్ అదే నిజం అనేది అందరికీ తెలుసు. అది ఎన్టీఆర్ స్టామినా కూడా. ఆ స్టామినా తాజాగా ఓవర్శీస్ బాక్సాఫీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రూవ్ చేస్తున్నాయి. ఈ లెక్కలు చూస్తే హృతిక్ కంటే ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ అనేది అర్థం అవుతుంది.

వార్ 2 యూఎస్ఏ అడ్వాన్స్ సేల్స్ 130కే డాలర్స్ దాటింది. అయితే వీటిలో తెలుగు వెర్షనే 100కే డాలర్స్ ఉంది. హిందీ వెర్షన్ కేవలం 30కే డాలర్స్ మాత్రమే ఉంది. దీన్ని బట్టి ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అది ఎన్టీఆర్ స్టామినా. మరి అంత స్టామినా ఉన్నవాడికి 60 కోట్ల రెమ్యూనరేషన్ అనేది పెద్ద విషయమేం కాదు. ఇంకా చెబితే హృతిక్ రోషన్ కు హిట్ వచ్చి దశాబ్దం దాటింది. అలా చూసుకున్నా.. ఆ రెమ్యూనరేషన్స్ కరెక్టే అనుకోవచ్చు. మొత్తంగా ఎన్టీఆర్ బాలీవుడ్ ను కూడా రూల్ చేయబోతున్నాడేమో అనేందుకు ఇదో ఎగ్జాంపుల్.

Tags:    

Similar News