Allu Arjun : అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది పుష్పా..

Update: 2024-11-18 10:12 GMT

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సినిమా వాతావరణం కాస్త తక్కువగా ఉండే బిహార్ లోని పట్నాలో ట్రైలర్ రిలీజ్ చేస్తే.. ఊహించనంత మంది జనం వచ్చారు. ఇది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకూ ఏ ప్యాన్ ఇండియా హీరో ట్రైలర్ లాంచ్ కు.. ఆ మాటకొస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా అంతమంది జనం గ్యాదర్ కాలేదు. అది కేవలం అల్లు అర్జున్ స్టామినా అంటున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి రష్మిక మందన్నా మరోసారి ఎసెట్ కాబోతోంది. ట్రైలర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ఇదంతా ఓ ఎత్తైతే.. పుష్ప 2 ట్రైలర్ చూసిన తర్వాత అందరూ చాలా బావుంది అన్నారు. అయినా పుష్పకు, పుష్ప 2కు మధ్య ఏం మారింది అనే ప్రశ్న కూడా కనిపిస్తోంది.

ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు పెద్ద కష్టమేం కాదు. పుష్ప రైజింగ్ సాధారణంగా మొదలై.. జడివానలా ఎండ్ అవుతుంది. పుష్ప 2 ట్రైలర్ స్టార్డింగే జడివానలా మొదలై సునామీలా ఎండ్ కాబోతోందని అర్థం అవుతోంది. చూడ్డానికి రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు సీక్వెల్ లానే కనిపిస్తోన్నా.. ఈ సారి పుష్ప రూలింగ్ రూలింగ్ పార్టీలను( సినిమాలో) వణికించబోతోందని తెలుస్తోంది. ఇలాంటి ట్రైలర్.. ను కట్ చేయడం అంటే ఒక ఆర్ట్ అనే చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ ఓ సీక్వెన్స్ లా ట్రైలర్ లోనే కనిపిస్తుంటే.. సినిమాల్లో ఆ ఎపిసోడ్స్ అన్నీ నెక్ట్స్ లెవల్ లో హైలెట్ అవుతాయని వేరే చెప్పక్కర్లేదు. పుష్పరాజ్ తన రేంజ్ ను ఎంతలా పెంచుకున్నాడు అంటే... అప్పుడు ఫైర్ అయితే.. ఇప్పుడు వైల్డ్ ఫైర్, అప్పుడు నేషనల్ అయితే... ఇప్పుడు ఇంటర్నేషనల్.. అప్పుడు ప్రేమ కోసం తపిస్తే.. ఇప్పుడు పెళ్లాం కోసం ఎంత దూరమైనా వెళ్లే టైగర్ లాంటోడు. ఎలా చూసినా.. ఇదో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సరంజామాలా కనిపిస్తోంది. బాహుబలి రికార్డ్స్ కు అతి చేరువలోకి వెళ్లే మూవీలా ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు.

ఐకన్ స్టార్ పుష్ప 2 కోసం ప్రాణం పెట్టాడని సుకుమార్ చెప్పాడు. అలాగే దీన్నో తపస్సులా చేశాడని త్రివిక్రమ్ అన్నాడు. ఇవన్నీ నిజమే అని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ విషయం డిస్ట్రిబ్యూటర్స్ అంతా ముందే ఎక్స్ పెక్ట్ చేశారు కాబట్టే... ట్రైలర్ కూడా రాకుండానే ఈ మూవీ 1000 కోట్ల బిజినెస్ చేసింది. ఈ బిజినెస్ కు భారీ లాభాలు అనే మాట తోడైతే.. బాహుబలి 2 రికార్డులు చాలా వరకూ చాలా చోట్ల కనుమరుగైపోతాయ్.

Tags:    

Similar News