Drushyam 2 : 'దృశ్యం2'లో నటించిన ఈ సరిత ఎవరు?
Drushyam 2 : వెంకటేష్, మీనా ప్రధానపాత్రలో వచ్చిన తాజా చిత్రం దృశ్యం2... నిన్న(గురువారం నవంబర్ 25) అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.;
Drushyam 2 : వెంకటేష్, మీనా ప్రధానపాత్రలో వచ్చిన తాజా చిత్రం దృశ్యం2... నిన్న(గురువారం నవంబర్ 25) అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ముగిసిన కేసును పోలీసులు రీఓపెన్ చేస్తే రాంబాబు మళ్ళీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవటం అన్నది సినిమా కథ.. మలయాళంలో ఒరిజినల్ సినిమాని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాని తెరకెక్కించాడు.
సురేశ్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ ఈ సినిమాని నిర్మించారు. అయితే ఈ సినిమాలో సరిత అనే పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది నటి సుజా వరుణీ.. ఈమె ఎవరు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. సుజా వరుణి అసలు పేరు సుజాత.. ఆమె తమిళం , కన్నడ , తెలుగు, మలయాళ చిత్రాలలో నటించింది. 2002లో తమిళ్‌లో వచ్చిన ప్లస్ 2 చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత వరుసగా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. ఇక తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన నాగవల్లి సినిమాలో హేమ అనే చిన్న రోల్ చేసింది. ఆ తర్వాత గుండెల్లో గోదారి, దూసుకెళ్తా, అలీ బాబా ఒక్కడే దొంగ సినిమాలు చేసింది. కానీ ఇవేమీ ఆమెకి అంతగా పేరును తీసుకురాలేదు. కానీ తాజాగా రిలీజైన దృశ్యం 2 ఆమెకి మంచి బ్రేక్ ఇచ్చింది.
పక్కంట్లో ఉండే ఇల్లాలుగా, అండర్ కవర్ కాప్‌గా ఆకట్టుకుంది సుజా వరుణి. ఇక తమిళ్‌లో కమలహసన్ హోస్ట్ గా 2017లో వచ్చిన బిగ్ బాస్ లో ఈమె పాల్గొంది. 91 రోజులు హౌజ్ లో ఉండి ఎలిమినేట్ అయింది. ఇక సుజా వరుణి వ్యక్తిగత జీవితానికి వస్తే.. నటుడు శివాజీ దేవ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.
ఈ శివాజీ దేవ్ ఎవరో కాదు ఒకప్పటి తమిళ స్టార్ హీరో శివాజీగణేశన్ మనవడు. ఇతను సుజా వరుణి కంటే ఐదేళ్ళు చిన్నవాడు కావడం విశేషం. వీరికి అధ్వైత్ అనే కుమారుడు ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా సుజా వరుణీ మంచి యాక్టివ్ గా ఉంటుంది.