ఒక హిట్ వస్తే వరుస ఫ్లాపులు అన్నట్టుగా ఉంటుంది నితిన్ కెరీర్. కొన్నాళ్ల క్రితం ఈ ట్రెండ్ మారింది. హ్యాట్రిక్ విజయాలు పడ్డాయి. దీంతో మనోడు గాడిలో పడ్డాడు అనుకున్నారు. బట్.. ఫ్లాపులు మాత్రం వదలడం లేదు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తర్వాత వరుసగా అన్ని ఫ్లాపులు ఉన్న హీరో నితినే అని చెప్పాలి. కాకపోతే పవన్ సినిమాలు పోయినా కమర్షియల్ గా సేఫ్ అవుతాయి. నితిన్ కు ఆ రిలీఫూ ఉండదు. 2020లో వచ్చిన భీష్మ తర్వాత ఆ స్థాయి కమర్షియల్ హిట్ లేదు. తర్వాత వచ్చిన చెక్, రంగ్ దే, మేస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలు వరుసగా పోయాయి.
ప్రస్తుతం భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ అంటూ రాబోతున్నాడు. అలాగే శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో తమ్ముడు అనే సినిమా కూడా రూపొందుతోంది. రీసెంట్ గా రాబిన్ హుడ్ టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తే ప్రామిసింగ్ ప్రాజెక్ట్ లానే అనిపిస్తోంది. నితిన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోందీ మూవీలో. డిసెంబర్ 25న విడుదల కాబోతోందని ప్రకటించారు. టీజర్ లో యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూ మంచి స్కోప్ ఉన్నట్టు కనిపిస్తోంది. వెంకీ కుడుముల కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఛలో, భీష్మ చిత్రాలతో అది ప్రూవ్ అయింది. మంచి కంటెంట్ కూడా కనిపిస్తుంది. అందుకే ఈ సారి నితిన్ గ్యారెంటీగా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. కాకపోతే ఇలాంటి ఫీలింగ్ అన్ని టీజర్స్ లోనూ కనిపించింది. సినిమాలు మాత్రం తేడా కొడుతున్నాయి. అలా కాకుండా రాబిన్ హుడ్ తో బాక్సాఫీస్ ను గెలవాలి. అసలే కొత్త కొత్త కంటెంట్స్ కొత్తవాళ్లు వస్తున్నారు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సినిమాలు పోతూ ఉంటే.. చివరికి మార్కెట్ వరుణ్ తేజ్ లా మారిపోతుంది. మరో రెండు మూడు ఫ్లాపులు పడితే మినిమం ఓపెనింగ్స్ కూడా రావు. అందుకే ఈ సారి నితిన్ ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిందే.