War 2 vs Coolie : తెలంగాణలో టికెట్ ధరలు పెరుగుతాయా..?

Update: 2025-08-12 10:40 GMT

కొత్త సినిమాలు విడుదలవుతున్నాయంటే.. అది కూడా భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ ఉన్న మూవీస్ అయితే ప్రభుత్వాల దగ్గరకు వెళ్లి టికెట్ రేట్లను పెంచుకుంటున్నారు నిర్మాతలు. కొన్నాళ్లుగా తెలంగాణలో రేట్లు పెంచడం కుదరదు అని ప్రభుత్వం తీర్మానం చేసుకుంది. అది అమలు చేశారు కూడా. కానీ రీసెంట్ గా హరిహర వీరమల్లు, కింగ్ డమ్ సినిమాలకు మినహాయింపు ఇచ్చారు. మరీ గతంలోలాగా భారీగా పెంచలేదు కానీ.. మినిమంగా అయినా పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో ఈ 14న విడుదల కాబోతోన్న వార్ 2, కూలీ చిత్రాల ధరలు కూడా పెంచుతారు అనుకున్నారు చాలామంది.

బట్ తెలంగాణలో ఆ అవకాశం ఇవ్వడం లేదు. ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. మిడ్ నైట్ షోస్ కు కూడా అనుమతి ఉండకపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ షోస్ వరకూ ఛాన్స్ ఉండొచ్చు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అటు రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన కూలీపైనా భారీ అంచనాలున్నాయి. నాగార్జున విలన్ గా నటించడం ఈ సినిమాకు తెలుగులో మరో ఎసెట్ అవుతుంది. ఓ రకంగా రెండూ క్రేజీ మూవీస్. అందుకే ధరలు పెరుగుతాయి అనుకున్నారు. కానీ మళ్లీ తెలంగాణ ప్రభుత్వం మనసు మార్చుకున్నట్టుంది. టికెట్ రేట్లు పెంచడానికి లేదు అని తేల్చి చెప్పిందట. 

Tags:    

Similar News