Venkatesh : వెంకటేష్ కు ఆ సత్తా ఉందా..?

Update: 2025-01-22 08:30 GMT

దశాబ్దాల క్రితమే విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్నాడు వెంకటేష్. కానీ మిగతా హీరోల రేంజ్ అతనికి రాలేదు అనేది నిజం. కాకపోతే తన రేంజ్ లో మంచి విజయాలు అందుకున్నాడు. అదే టైమ్ లో నెగెటివిటీ అస్సలు లేని హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. ఓ రకంగా అతని సినిమా ప్రయాణం నల్లేరు మీద నడక లాంటిది. అందుకే అతనూ భారీ విజయాలు, పెద్ద పెద్ద హైప్ లు ఎక్స్ పెక్ట్ చేసినట్టు కనిపించడు. తన నిర్మాతలు హ్యాపీస్ అయితే తనూ హ్యాపీ అనేలానే ఉన్నాడు. బట్ ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ విజయం అతని కెరీర్ కు కొత్త టాస్క్ ను సెట్ చేసింది. ఈ టాస్క్ ను ఛేదించి ఈ విజయ యాత్రను కొనసాగించే సత్తా వెంకటేష్ లో ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ 8 రోజుల్లోనే 218 కోట్లు కొల్లగొట్టింది. తనతరం హీరోల్లో ఈ ఫిగర్ సాధించిన రెండో హీరోగా నిలిచాడు వెంకటేష్. ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగేలానే ఉన్నాయి తప్ప తగ్గేలా కనిపించడం లేదు. సింపుల్ స్టోరీ లైన్ తో ఇంత పెద్ద విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఈ చిత్రానికి సంక్రాంతి పండగ కలిసొచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే పేరు ఉపయోగపడింది. దీనికి తోడు తనకు భారీ పోటీ ఇస్తాయనుకున్న సినిమాలు రెండూ ఒక దశ దాటిన తర్వాత ఆగిపోయాయి. దీంతో ఆ థియేటర్స్ ను కూడా ఈ వెంకటేష్ మూవీకే ఇచ్చారు కొన్నిచోట్ల. పండగల టైమ్ లో ఇలాంటి సెలబ్రేటింగ్ మూవీస్ కు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అదే సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిరూపించింది.

అయితే ఈ 200 కోట్ల మార్క్ అనేది వెంకటేష్ పెద్ద బర్డన్ గానూ మారుతుంది. తర్వాతి సినిమాలపైనా అంచనాలుంటాయి. ఆ చిత్రాలూ ఈ ఫిగర్ ను చేరాలనో, దాటాలనో కోరుకుంటారు. బట్ వెంకీకి ఆ కోరిక ఉందనుకోలేం. కాకపోతే మార్కెట్ లెక్కలు, బిజినెస్ కాలిక్యులేషన్స్ అంటూ ఉంటాయి కదా..? ఆ లెక్కల ప్రకారం తన కెరీర్ లోనే కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నాడు. ఆ మార్క్ ను ప్రతిసారీ టచ్ చేయలేకపోయినా తగ్గితే మాత్రం తేడాలొస్తాయి. కానీ వెంకీ కెరీర్ తో పాటు ఫ్యాన్ బేస్ ను చూసుకున్నా.. మార్కెట్ ను చూసుకున్నా.. ఈ సంక్రాంతి విజయం అతనికి కెరీర్ బెస్ట్ అంతే అనుకోవచ్చు. మళ్లీ ఇలాంటి సినిమా పడొచ్చేమో కానీ ఆ స్థాయి కలెక్షన్స్ రావడం మాత్రం అసాధ్యం అనలేం కానీ.. ఈ ఏజ్ లో కష్టమే అనుకోవాలి. పైగా వెంకటేష్ ఏమీ మాస్ అండ్ యాక్షన్ హీరో కాదు. అలాంటి వారికే ఇలాంటి టాస్క్ లు ఛేదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో వెంకీకి సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ అనేది ఊహించని గిఫ్ట్ లాగానే చూడాలేమో. మళ్లీ ఈ టార్గెట్ గా కథలు ఎంచుకుంటే వర్కవుట్ అవుతాయా అంటే కూడా చెప్పలేం. ఎందుకంటే వీళ్లు కూడా ఈ మూవీ అంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని చెబుతున్నారు కాబట్టి. సో.. రాబోయే రోజుల్లో మళ్లీ 200 కోట్లు సాధించే సత్తా వెంకటేష్ లో ఉందా అంటే.. చాలా వరకు కష్టం అనే ఆన్సరే వస్తుందేమో. ఒకవేళ సాధిస్తే మాత్రం ‘‘ఎనీ సినిమా డబుల్ హండ్రెడ్ గ్యారెంటీ’’ఫర్ వెంకటేష్ అనే డైలాగ్ ను మళ్లీ మళ్లీ చెప్పుకోవచ్చు. 

Tags:    

Similar News