AB de Villiers: 'ఇండియన్ టీమ్‌లో చోటు దక్కించుకోవడం చాలా కష్టం' ఎబి డెవిలియర్స్
AB de Villiers: ఎబి డెవిలియర్స్.. పేరుకే దక్షిణాఫ్రికా క్రికెటర్ కానీ.. ఇండియాలో తన ఆటకు చాలామంది అభిమానులు ఉన్నారు.;
AB de Villiers (tv5news.in)
AB de Villiers: ఒక రంగంలో రాణించిన వారు ప్రేక్షకులకు నచ్చితే వారు ఏ దేశంవారు? ఏ రాష్ట్రంవారు? అన్న విషయాలను పక్కన పెట్టి మరీ అభిమానిస్తారు. అలా ఏ బేధం లేకుండా అందరినీ ప్రేక్షకులు ఒకేలాగా రంగం క్రికెట్. క్రికెట్‌లో ఆట బాగా ఆడితే చాలు.. ఆ ఆటగాడికి వెంటనే ఫ్యాన్స్ అయిపోతారు. అందుకే దక్షిణాఫ్రికా క్రికెటర్ అని బేధం లేకుండా ఇండియన్స్ అందరూ ఇష్టపడే ఆటగాడు. ఈ మాజీ క్రికెటర్ ఇటీవల ఇండియన్ టీమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఎబి డెవిలియర్స్.. పేరుకే దక్షిణాఫ్రికా క్రికెటర్ కానీ.. ఇండియాలో తన ఆటకు చాలామంది అభిమానులు ఉన్నారు. అందుకే తాను క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ఇస్తున్నట్టు ప్రకటించినప్పుడు కేవలం దక్షిణాఫ్రికా వారు మాత్రమే కాదు.. ఇండియన్స్ కూడా బాధపడ్డారు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ఆడి మెప్పించిన ఈ ఆటగాడు.. ఇటీవల ఇండియన్ క్రికెట్ టీమ్‌పై పోడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు.
'ఇండియన్ టీమ్‌లో ఎదగడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. నేను అయితే ఎప్పటికీ ఇండియన్ టీమ్‌లో ఆడేవాడిని కాదేమో.. ఇండియన్ టీమ్‌లో చోటు దక్కించుకోవడం చాలా కష్టం. అలా జరగాలంటే చాలా స్పెషల్ ప్లేయర్ అయ్యిండాలి. ఆర్‌సీబీలో ఆడిన రోజులు నా జీవితంలోనే మర్చిపోలేనివి.' అని పోడ్‌కాస్ట్‌లో తన మనసులోని మాటలను బయటపెట్టాడు ఎబిడి.