IPL 2022 : ఐపీఎల్‌లో మరో రెండు కొత్త జట్లు..!
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. కొత్తగా లక్నో, ఆహ్మదాబాద్ ఫ్రాంచైజీలను బీసీసీఐ ప్రకటించింది.;
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. కొత్తగా లక్నో, ఆహ్మదాబాద్ ఫ్రాంచైజీలను బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఐపీఎల్ లో జట్ల సంఖ్య పదికి చేరింది. లక్నో ఫ్రాంచైజీని సంజీవ్ గోయెంకా గ్రూప్ 7090 కోట్లకు దక్కించుకోగా... ఆహ్మదాబాద్ ఫ్రాంచైజీని సివిసి కంపెనీ 5600 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ లో పది జట్లు ఆడతాయని బిసిసిఐ తెలిపింది. ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్ లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. గత ఐపీఎల్ సీజన్స్‌లో కొన్ని జట్లు అలా వచ్చి వెళ్లిపోయాయి. వాటిలో డెక్కన్ ఛార్జర్స్(2008-2012), కోచి టస్కర్స్(2011), పుణె వారియర్స్ (2011-2013), రైజింగ్ పుణె సూపర్ జెయింట్ (2016-2018), గుజరాత్ లయన్స్ (2016-2018) జట్లు ఆయా సీజన్స్‌లో ఆడి, ఆ తర్వాత రద్దై పోయాయి.