Ajaz Patel : పుట్టిన గడ్డపైనే పది వికెట్లు తీసిన ఒకే ఒక్కడు
Ajaz Patel : న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ అరుదైన ఫీట్ సాధించాడు. పదికి పది వికెట్ల కలను సాకారం చేసుకున్నాడు.;
Ajaz Patel : న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ అరుదైన ఫీట్ సాధించాడు. పదికి పది వికెట్ల కలను సాకారం చేసుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగుతున్న రెండో టెస్ట్ లో పదికి పది వికెట్లు పడగొట్టాడు. ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్ గా నిలిచాడు. గతంలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. సిరాజ్ వికెట్ పడగొట్టి తన పుట్టిన గడ్డపైనే పర్ఫెక్ట్ టెన్ ఘనత అందుకున్నాడు. ముంబైలో పుట్టి న్యూజిలాండ్ తరపున ఆడుతున్న స్పిన్నర్ అజాజ్ పటేల్... భారత బ్యాట్స్ మెన్ అందర్నీ తన స్పిన్ ఉచ్చులో పడేశాడు. తొలి రోజు నాలుగు వికెట్లు పడగొట్టిన అజాజ్ పటేల్... ఈ రోజు మిగిలిన ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీపక్ పటేల్, జీతన్ పటేల్ సక్సెసర్ గా న్యూజిలాండ్ జట్టులో చోటు సంపాదించిన అజాజ్ పటేల్‌కిది పదకొండో టెస్ట్ మ్యాచ్.