New Zealand Tour Of India 2021 : రోహిత్ శర్మ vs అజింక్య రహానే.. టెస్టు కెప్టెన్‌ ఎవరు?

New Zealand Tour Of India 2021: టీ20 ప్రపంచకప్‌‌‌లో భారత్ ఆట ముగిసింది. సెమిస్‌‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టేసింది. ఇప్పుడు స్వదేశంలో కివీస్‌తో జరగబోయే సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది.

Update: 2021-11-11 09:59 GMT

New Zealand Tour Of India 2021 : టీ20 ప్రపంచకప్‌‌‌లో భారత్ ఆట ముగిసింది. సెమిస్‌‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టేసింది. ఇప్పుడు స్వదేశంలో కివీస్‌తో జరగబోయే సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే 16 మందితో కూడిన సభ్యులను బీసీసీఐ ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన విరాట్‌ కోహ్లి స్థానంలో రోహిత్‌ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.

నవంబర్ 17నుంచి కివీస్‌‌‌‌తో మొదలయ్యే ఈ సిరీస్ నుంచి టీ20లకి పూర్తిస్థాయి కెప్టెన్‌‌‌గా రోహిత్ కొనసాగానున్నాడు. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌‌‌గా కొనసాగానున్నాడు. ఇదిలావుండగా కోహ్లి గైర్హాజరీ నేపథ్యంలో టెస్టు కెప్టెన్సీ ఎవరికి అప్పగించాలన్న విషయంలో బీసీసీఐ అతలాకుతలం అవుతోంది. ఈ విషయంలో టెస్టు బాధ్యతలు కూడా రోహిత్‌ శర్మకే ఇవ్వాలా లేకపోతే ఇన్నాళ్లుగా వైస్‌ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేకు బాధ్యతలను అప్పగించాలా అనే సందిగ్ధంలో ఉంది.

దీనిపైన త్వరలోనే ఓ క్లారిటీ ఇవ్వనుంది బీసీసీఐ. కాగా కివీస్ తో జరగబోయే సిరీస్ తో హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రస్థానం మొదలుకానుంది. మూడు టీ20 మ్యాచ్‌ల తర్వాత.. నవంబరు 25 నుంచి డిసెంబరు 7 వరకు టీమిండియా కివీస్‌తో రెండు టెస్టులు ఆడనుంది. మొదటిటెస్టుకు కోహ్లీ దూరంగా ఉండనున్నాడు.

Tags:    

Similar News