ఇది వైడ్ కాదా..? లేదు బాల్ లోపల పడింది : తెలుగులో మాట్లాడుకున్న దినేష్ కార్తీక్, అంపైర్
ఇది వైడ్ కాదా..? లేదు బాల్ లోపల పడింది : తెలుగులో మాట్లాడుకున్న దినేష్ కార్తీక్, అంపైర్;
క్రికెటర్లు మ్యాచ్ ఆడుతున్న సమయంలో తమ మాతృభాషలో మాట్లాడడం చాలాసార్లు చూశాం. కానీ కోల్‌కతా బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్... నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ శంషుద్దీన్‌తో తెలుగులో మాట్లాడాడు. సామ్ కరన్ వేసిన బాల్ వికెట్లకు దూరంగా వెళ్లడంతో... ఇది వైడ్ కాదా అని కార్తీక్ ప్రశ్నించాడు. హైదరాబాదీ అయిన అంపైర్ శంషుద్దీన్.. బంతి చాలా లోపల పడిందని... నవ్వుతూ జవాబిచ్చాడు. స్టంప్ మైక్‌లలో వీరిద్దరి తెలుగు సంవాదం రికార్డ్ అయింది.