భారత ఆటగాళ్లకు ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్!
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన ఆరుగురు ఆటగాళ్లకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గిఫ్ట్ లు ప్రకటించారు.;
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన ఆరుగురు ఆటగాళ్లకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గిఫ్ట్ లు ప్రకటించారు. నటరాజన్, సిరాజ్, శార్దూల్, వాషింగ్టన్, గిల్, సైనీకి కార్లు ఇస్తానని ప్రకటించారు. వాటిని తన సొంత డబ్బులతోనే కొనివ్వనున్నట్లు మహీంద్రా స్పష్టం చేశారు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అనుభవం లేకున్నా.. ఈ యువ ప్లేయర్లు తమని తాము నమ్ముకొని ఆడిన విధానం తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు.
అంతేకాకుండా ఈ ఆరుగురు ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటన ద్వారా భవిష్యత్తుపై ఆశలు కల్పించారని కొనియాడారు. వారు తమ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు ఆయన. కాగా ఇప్పటికే బీసీసీఐ భారత జట్టుకు 5 కోట్ల రూపాయల నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే!