Virat Kohli : విరుష్క జోడీ పిలుపుతో ఏకంగా 11.39 కోట్ల ఫండ్..!
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ క్రమంలో పేద ప్రజలకి అండగా నిలించేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు.;
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ క్రమంలో పేద ప్రజలకి అండగా నిలించేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు రూ. 2 కోట్ల రూపాయలతో ఫండ్ రైజింగ్ కార్యక్రమం మొదలు పెట్టారు. వారం రోజులలో రూ. 7 కోట్ల ఫండ్‌ని సేకరించాలనే టార్గెట్‌గా పెట్టుకున్న వీరికి ఏకంగా 11 కోట్లు వచ్చాయి. ఈ విషయాన్నీ కోహ్లీ వెల్లడించాడు. మా పిలుపు మేరకు స్పందించి ఫండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలిపాడు. కాగా ఈ నగదు ఈ మొత్తాన్ని కరోనా బాధితుల అవసరాలను తీరుస్తున్న యాక్ట్ గ్రాంట్స్ అసోషియేషన్‌కి ఇవ్వాలని విరుష్క జోడీ ముందుగానే నిర్ణయించిన విషయం తెలిసిందే.