రిచర్డ్‌సన్ సంచలనం.. వేలంలో ఏకంగా రూ.14 కోట్లకి.. !
ఆసీస్ యువ పేస్ బౌలర్ జై రిచర్డ్‌సన్ ఐపీఎల్ వేలంలో సంచలనం సృష్టించాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.14 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది.;
ఆసీస్ యువ పేస్ బౌలర్ జై రిచర్డ్‌సన్ ఐపీఎల్ వేలంలో సంచలనం సృష్టించాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.14 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది. రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో ఎంట్రీ ఇచ్చిన అతన్నీ పంజాబ్ కింగ్స్ అంత ధర పెట్టి కొనడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా బిగ్ బాష్ లీగ్‌లో అతనికి సక్సెస్ పేస్ బౌలర్‌గా పేరుంది. 16.31 సగటుతో 29 వికెట్లు పడగొట్టాడు. అటు 2017 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రిచర్డ్‌సన్ అప్పటి నుండి రెండు టెస్టులు, 13 వన్డేలు మరియు తొమ్మిది టీ 20లు ఆడాడు.