Bangladesh vs Afghanistan: T20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్
డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో 5 బంతులు మిగిలి ఉండగానే 117 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా షకీబుల్ హసన్ నిలిచాడు.ఈ సిరీస్ విజయంతో బంగ్లా ఈ ఏడాది 3వ టీ20 సిరీస్ విజయాన్ని నమోదుచేసింది.;
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టీ20ని బంగ్లాదేశ్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో 5 బంతులు మిగిలి ఉండగానే 117 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా షకీబుల్ హసన్ నిలిచాడు.ఈ సిరీస్ విజయంతో బంగ్లా ఈ ఏడాది 3వ టీ20 సిరీస్ విజయాన్ని నమోదుచేసింది.
117 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన బంగ్లాదేశ్‌కి ఓపెనర్లు లిట్టన్ దాస్(35), ఆఫిఫ్ హొస్సేన్(24)లు మంచి ఆరంభాన్నిచారు. మొదటి ఓవర్లో ఆఫ్ఘాన్ పేసర్ ఫారూఖీకి స్వాగతం పలికిన లిట్టన్ దాస్, రెండవ ఓవర్లో వరుసగా 3 ఫోర్లతో బంగ్లా లక్ష్యచేదనకు బాటలు వేశాడు. దీంతో టీ20ల్లో ఆరంగేట్రం చేసిన వఫాదర్ మోమద్ తన తొలి ఓవర్లోనే 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ జోడీ 7 ఓవర్లనే 49 పరుగులు చేసింది. రషీద్ ఖాన్, ముజీబ్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో బంగ్లా పరుగుల వేగం తగగింది. 9వ ఓవర్లో ముజీబ్ ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేయడంతో ఆఫ్ఘాన్ శిబిరంలో ఆశలు మొదయ్యాయి. తర్వాత ఓవర్లో షాంటోని ఒమర్జాయ్ ఔట్ చేయగా, వరుస వికెట్లతో బంగ్లా కష్టాల్లో పడింది. కేవలం 36 బంతుల్లో 43 చేయాల్సి ఉంది. తర్వాత 5 ఓవర్లలో రన్ రేట్ 8 పైగా పెరిగింది. షకీబ్(18), హ్రిదోయ్(19)లు ధాటిగా ఆడటంతో కావాల్సిన పరుగులు, బంతులు సమమయ్యాయి. 17వ ఓవర్ మొదటి బంతికి బంతిని బౌండరీకి తరలించిన షకీబ్ బంగ్లాకి విజయాన్నందించాడు.
అంతకుముందు టాస్ గెఎలిచిన ఆఫ్ఘాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్లోనే సిక్స్ కొట్టిన రహ్మనుల్లా గుర్బాజ్‌ని తస్కిన్ అహ్మద్ షార్ట్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. 3వ ఓవర్లో మరో ఓపెనర్‌ని కోల్పోయింది. ౭వ ఓవర్లో వర్షం ఆటంకం కలిగించడంతో, 17 ఓవర్లకు కుదించడంతో మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభమైంది. తర్వాత మహ్మద్ నబీ అర్ధసెంచరీతో రాణించడంతో బంగ్లా 17 ఓవర్లలో 116 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో టస్కిన్ 3 వికెట్లు, ముస్తాఫిజర్, షకీబ్‌లు 2 వికెట్లు తీశారు.