South Africa Test: సౌత్ ఆఫ్రికా టెస్ట్‌కు సర్వం సిద్ధం.. చివరి నిమిషంలో మార్పులు జరుగుతాయా?

South Africa Test: ఒకప్పుడు కరోనా అనే మహమ్మారి వల్ల చాలామంది జీవితాలకు పాస్ పడిపోయింది.

Update: 2021-12-08 15:56 GMT

South Africa Test: ఒకప్పుడు కరోనా అనే మహమ్మారి వల్ల చాలామంది జీవితాలకు పాస్ పడిపోయింది. అంతే కాదు.. ఏ రకంగానూ ప్రజలకు ఎంటర్‌టైన్మెంట్ దారి లేకుండా పోయింది. ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ కూడా అలాగే విజృంభణ కొనసాగిస్తోంది. అయితే సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఈ కొత్త రకం వేరియంట్‌ను పట్టించుకోకుండా టీమిండియా సౌత్ ఆఫ్రికా సిరీస్‌కు సిద్ధమవుతోంది.

సౌత్ ఆఫ్రికా టూర్‌కు వెళ్లే విషయం గురించి బీసీసీఐను అడగగా పరిస్థితులు అనుకూలిస్తేనే టూర్ జరగనుందని స్పష్టం చేసింది. కానీ ఇప్పుడేమో ఏకంగా సౌత్ ఆఫ్రికా టూర్‌కు ఎవరెవరు వెళ్తున్నారో ప్రకటించింది. సౌత్ ఆఫ్రికాకు వెళ్తున్న టీమిండియా ప్లేయర్స్ వివరాలు..

సౌత్ ఆఫ్రికాలో జరిగే టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లీనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని ముందుగా వార్తలు వచ్చాయి కానీ ఎందుకో సడెన్‌గా డెసిషన్ మార్చేసింది బీసీసీఐ. కానీ ఉన్నట్టుండి విరాట్ కాకుండా రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండనున్నాడని వెల్లడించారు.

ఇక కేఎల్ రాహుల్, మయంక్ అగర్వాల్, పుజారా, రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్, సాహా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, షమీ, ఉమేశ్ యాదవ్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్ టీమ్‌లో ఉన్నారు. ఇక స్టాండ్ బై ప్లేయర్లుగా సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జున్ ఎంపికయ్యారు.

ఒమిక్రాన్ వేరియంట్‌ను దృష్టిలో పెట్టుకుని సౌత్ ఆఫ్రికాలో నియమనిబంధనలు కఠినం చేస్తే.. టెస్ట్ క్యాన్సల్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. చివరి నిమిషం వరకు టీమిండియా.. సౌత్ ఆఫ్రికా టెస్ట్‌కు వెళ్తుందా లేదా అని సందేహిస్తున్నారు క్రికెట్ లవర్స్.

Tags:    

Similar News