టీంఇండియా ఆటగాళ్లకి బీసీసీఐ బంపర్ ఆఫర్!

ఈ క్రమంలో బీసీసీఐ టీంఇండియా ఆటగాళ్లకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీంబోనస్ కింద అయిదు కోట్ల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించింది.

Update: 2021-01-19 10:00 GMT

ఆస్ట్రేలియా పై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన టీంఇండియాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీతో పాటుగా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ఆటగాళ్ళు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ టీంఇండియా ఆటగాళ్లకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీంబోనస్ కింద అయిదు కోట్ల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేశారు. భారత క్రికెట్ చరిత్రలో ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదని, ఆటగాళ్ళు అందరూ చాలా గొప్పగా రాణించారని కొనియాడారు.

ప్రపంచ క్రికెట్ లో శక్తివంతమైన జట్టుగా ఆసీస్ కి పేరుంది. ఆలాంటి ఆసీస్ ని ఎలాంటి సీనియర్లు లేకుండా కేవలం జూనియర్లతోనే వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించడం అంటే మాములు విషయం కాదు.. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో గిల్ (91), పూజారా (56), పంత్ (89 నాటౌట్ ), సుందర్ (22) వీరోచిత పోరాటంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అసలు ఈ మ్యాచ్ డ్రా అవ్వడమే గొప్ప అనుకుంటే భారత్ ను గెలిపించి హీరోస్ అయ్యారు. గత 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆసీస్ జట్టుకు టీమిండియా ఓటమి రుచి చూపించడం అనేది మరో హైలెట్ గా చెప్పుకోవాలి! 

Tags:    

Similar News