IPL చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా క్రిస్ మోరిస్!
ఐపీఎల్ -2021 కోసం ఆటగాళ్ల వేలం చెన్నైలో జరుగుతోంది. సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ భారీ ధరకు అమ్ముడయ్యాడు. గతేడాది రూ.10 కోట్లకు అతన్నీ అర్సీబీ కొనగా.. ఈ ఏడాది అంతకుమించిన డిమాండ్ ఏర్పడింది.;
ఐపీఎల్ -2021 కోసం ఆటగాళ్ల వేలం చెన్నైలో జరుగుతోంది. సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ భారీ ధరకు అమ్ముడయ్యాడు. గతేడాది రూ.10 కోట్లకు అతన్నీ అర్సీబీ కొనగా.. ఈ ఏడాది అంతకుమించిన డిమాండ్ ఏర్పడింది. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ మోరిస్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు రూ.16.25కోట్ల రికార్డు ధరకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. యువరాజ్ సింగ్ 16కోట్ల (2015) తర్వాత రూ. 16 కోట్లు దాటిన రెండో ఆటగాడు క్రిస్ మోరిస్ కావడం గమనార్హం..!