టీమిండియాలో కరోనా వైరస్ కలకలం.. ఇద్దరు క్రికెటర్లకు పాజిటివ్
Coronavirus: కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాలో కరోనా దుమారం రేపుతోంది.;
Coronavirus: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా దుమారం రేపుతోంది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు వైరస్ బారిన పడినట్లు సమాచారం. కొవిడ్ సోకిన వారిని ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ సోకిన ప్లేయర్లు ఎవరనే విషయం మాత్రం వెల్లడించలేదు. మిగతా ఆటగాళ్లందరూ డర్హమ్‌లో ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశించారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఇక ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం తొలుత ఇద్దరికి కరోనా సోకింది. వారిలో ఒకరికి పూర్తిగా తగ్గిందని పేర్కొంది. మరొకరికి ఆదివారం కొవిడ్ టెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. అయితే కొవిడ్ బారిన పడిన వారికి లక్షణాలు లేవని, కొద్దిగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని టీమ్ యాజమాన్యం పేర్కొంది. బయో బబుల్ నిబంధనలను కఠినంగా పాటించాలని బీసీసీఐ సెక్రటరీ జై షా లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ఆరు వారాల సమయం ఉండటంతో బీసీసీఐ భారత ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది.
ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ఈ విరామ సమయాన్ని ఆస్వాదించారు. విరామ సమయంలో పేయర్లు బయో బబుల్ దాటి ఇంగ్లండ్ లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అనంతరం వింబుల్డన్, యూరో 2020 మ్యాచ్‌లను వీక్షించారు. మరోవైపు ఇంగ్లాండ్ లో డెల్టా వేరియట్ కేసులు భారీ సంఖ్యలో పెరిగాయి. ఇంగ్లాండ్- శ్రీలంక సిరీస్ సమయంలోనూ ఏడుగురు ఇంగ్లాండ్ ప్లేయర్లు, ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే.
Also Read:పదవతరగతి అర్హతతో అంగన్ వాడీ ఉద్యోగాలు..దరఖాస్తుకు ఆఖరు తేదీ ఈ రోజే..