Cricket : ధోనీ సెంచరీ చేయవలసిందిగా కోరాడు : గంభీర్

ప్రపంచకప్ మధుర స్మృతులను గుర్తుచేసుకున్న గౌతమ్ గంభీర్

Update: 2023-01-12 13:12 GMT

భారత్ లో క్రికెట్ ఒక మతం. యావత్ దేశం పూనకాలతో ఊగిపోయే ఓ పండగ. అందులో ప్రపంచ కప్ అంటే ఆ కిక్కే వేరు. 2011 ఏప్రిల్ 2 లో జరిగిన ప్రపంచ కప్ గురించి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఓ క్రీడా చానల్ తో మాట్లాడారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ధోనీ తనకు మద్దతుగా నిలిచాడని గంభీర్ తెలిపారు. తాను 90 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు... సెంచరీ చేయవలసిందిగా ధోనీ కోరాడని తెలియజేశారు. తన వద్దకు వచ్చి "నువ్వు సెంచరీ చేయు, కావాలంటే సమయం తీసుకో.. స్కోర్ బోర్డులో వేగం పెంచేందుకు నేను ప్రయత్నిస్తాను" అని ధోని కోరినట్లుగా చెప్పాడు. కాగా... గంభీర్ 97 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. తిసారా బౌలింగ్ లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. ధోనీ 91* పరుగులు చేసి భారత్ ను విజయతీరాలకు తీసుకెళ్ళాడు.

1983 లో కపిల్ సారథ్యంలో భారత్ మొదటి ప్రపంచ కప్ సాధించగా.... రెండోసారి 2011లో ధోనీ కెప్టెన్సీలో భారత్ వశమైంది. ఈ మ్యాచ్ లో గంభీర్ 97 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ కు కావలసిన రన్స్ ను అందించాడు. మహేంద్ర సింగ్ ధోనీ 91* పరుగులు చేసి... చివర్లో సిక్స్ కొట్టి భారత్ కు విజయాన్ని అందించాడు. పన్నెండేళ్ల తర్వాత 2023లో భారత్ వేదికగా ప్రపంచకప్ జరుగనుంది.

Tags:    

Similar News