CSK: సీఎస్‌కే టీమ్‌లో పెళ్లి వేడుక.. ఆ ఫారిన్ ఆటగాడి కోసం క్రికెటర్లంతా పంచకట్టులో..
CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఇలాంటి సమయంలో కూడా తన టీమ్‌మేట్ పెళ్లిలో జోష్ నింపుతున్నారు.;
CSK: ఐపీఎల్ టీమ్స్‌లో చాలామంది క్రికెట్ లవర్స్‌కు ఇష్టమైన టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. ఎమ్ ఎస్ ధోనీ సారథ్యంలో ఈ టీమ్ ఎన్నో ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. కానీ ఐపీఎల్ 2022లో మాత్రం సీఎస్‌కే పర్ఫార్మెన్స్‌కు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇక ఏ విధంగా సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశమే లేదని ఫిక్స్ అయ్యారు. ఇంత టెన్షన్ సమయంలో సీఎస్‌కే టీమ్‌లో పెళ్లి సందడి మొదలయ్యింది.
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ముందు నుండి ధోనీనే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మొదటిసారి కెప్టెన్సీ్ రవీంద్ర జడేజా చేతికి వచ్చింది. అయితే అటు ప్లేయర్‌గా, ఇటు కెప్టెన్‌గా వ్యవహరించాల్సి రావడంతో జడేజాపై ఒత్తిడి పడుతోందంటూ క్రికెట్ నిపుణులు చెప్తున్నారు. అందుకే ఇప్పటికి ఐపీఎల్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒక్కదాంట్లోనే విజయం సాధించి సీఎస్‌కే. ఇక తరువాతి మ్యాచ్‌ను తనకంటే తక్కువ స్కోర్‌లో ఉన్న ముంబాయి ఇండియన్స్‌తో ఆడనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఇలాంటి సమయంలో కూడా తన టీమ్‌మేట్ పెళ్లిలో జోష్ నింపుతున్నారు. సీఎస్‌కే ప్లేయర్ డెవాన్ కాన్వే తన పెళ్లిని ఇండియన్ స్టైల్‌లో చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే తన ప్రీ వెడ్డింగ్ పార్టీకి ఆటగాళ్లంతా పంచకట్టుతో అలరించారు. అంతే కాకుండా డ్యాన్సులతో పార్టీలో కొత్త జోష్‌ను తీసుకొచ్చారు.
📹 Colourful Kaatchis from the last night kondattam! 😎💛#SuperFam #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/hoJWgpzEbx
— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022