Dinesh Karthik : దినేష్ కార్తీక్ దంపతులకి కవల పిల్లలు..!
Dinesh Karthik : టీంఇండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ దంపతులకి కవల పిల్లలు జన్మించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు దినేష్.;
Dinesh Karthik : టీంఇండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ దంపతులకి కవల పిల్లలు జన్మించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు దినేష్. ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశాడు దినేష్..ముగ్గురం కాస్త ఐదుగురం అయ్యాం.. దీపిక నేను ఇద్దరు అందమైన మగపిల్లలతో ఆశీర్వాదం పొందాం.. ఇంతకన్నా సంతోషంగా ఉండలేము.. " అని పేర్కొన్నాడు. కాగా ఈ జంట తమ ఇద్దరు అబ్బాయిలకు కబీర్ పల్లికల్ కార్తీక్ మరియు జియాన్ పల్లికల్ కార్తీక్ అని పేరు పెట్టారు.. దినేష్ కార్తీక్ మరియు దీపిక పల్లికల్ 2015లో హిందూ సాంప్రదాయ పద్దతిలో మరియు క్రిస్టియన్ పద్దతిలో వివాహం చేసుకున్నారు.