Arun Lal: మొదటి భార్య పర్మిషన్‌తో మాజీ టీమిండియా క్రికెటర్ రెండో పెళ్లి..
Arun Lal: మాజీ టీమిండియా క్రికెటర్ అరుణ్ లాల్‌కు రీనా అనే మహిళతో మొదటి వివాహం జరిగింది.;
Arun Lal: ప్రేమ, పెళ్లిలాంటి వాటికి ఈమధ్య వయసుతో సంబంధం లేదు అనుకుంటున్నారు కొందరు. వయసు పైబడిన తర్వాత కూడా ఒక తోడు కోసం పెళ్లి చేసుకుంటున్న వారు ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి చేరాడు మాజీ టీమిండియా క్రికెటర్ అరుణ్ లాల్. ప్రస్తుతం అరుణ్ బెంగాల్ రంజీ జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 66 ఏళ్ల అరుణ్ లాల్ రెండో పెళ్లి విషయం క్రికెట్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అరుణ్ లాల్‌కు రీనా అనే మహిళతో మొదటి వివాహం జరిగింది. వీరిద్దరు చాలాకాలం క్రితమే విడాకులు కూడా తీసుకున్నారు. కానీ రీనా ఆరోగ్యం సరిగా లేక పూర్తిగా మంచానికే పరిమితం కావడంతో అరుణ్‌తోనే కలిసి ఉంటోంది. అయితే తన అనుమతితోనే అరుణ్ రెండో పెళ్లికి సిద్ధమయినట్టు సమాచారం. అంతే కాకుండా రీనాకు కూడా అరుణ్‌కు కాబోయే భార్య బాగా తెలుసట.
అరుణ్ లాల్.. 38 ఏళ్ల బుల్ బుల్ సాహ అనే మహిళను పెళ్లి చేసుకుంటున్నాడు. మే 2న కోల్‌కతాలో వీరి వివాహం గ్రాండ్‌గా జరగనుంది. అరుణ్ లాల్ పెళ్లి కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1982-89 మధ్యకాలంలో అరుణ్ క్రికెట్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. నేషనల్ స్థాయిలో తాను పెద్దగా రాణించలేకపోయినా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం బెస్ట్ అనిపించుకున్నాడు.
Arun Lal shared the invitation for his second marriage with his long-time friend Bul Bul Saha on May 2nd, 2022
— All About Cricket (@AllAboutCricke8) April 24, 2022
Congratulations Arun Lal #Cricket pic.twitter.com/CEybHsJDN1