Hardik Pandya : అవన్నీ తప్పుడు ఆరోపణలు.. ఆ వాచ్ ధర ఎంతంటే?
Hardik Pandya : తనపైన వస్తోన్న ఆరోపణల పైన టీంఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ మేరకు అతడు ట్వీట్ చేశాడు.;
Hardik Pandya : తనపైన వస్తోన్న ఆరోపణల పైన టీంఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ మేరకు అతడు ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఆ వాచ్ ధర రూ. 5 కోట్లు కాదని, దుబాయ్ లో రూ. 1.5 కోట్లకి చట్టప్రకారమే కొనుగోలు చేశానని స్పష్టం చేశాడు. తాను భారతదేశ పౌరుడిగా చట్టాన్ని గౌరవిస్తానని అన్నాడు. ఈ విషయంలో అధికారులకి సహరిస్తాని అన్నాడు. కస్టమ్స్ అధికారులు అడిగిన అన్ని పత్రాలను సమర్పించినట్టుగా వెల్లడించాడు. అయితే సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవి స్పష్టం చేశాడు. ఇదిలావుండగా గతేడాది హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్య వద్ద కూడా ఇలాగే విదేశీ వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దుబాయ్ నుంచి ముంబయికి వచ్చినప్పుడు అధికారులు పలు వాచ్‌లతో సహా భారీ మొత్తంలో బంగారం గుర్తించారు.