Hardik Pandya : హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్!
Hardik Pandya : టీ-20 వరల్డ్ కప్ తర్వాత దుబాయి నుంచి తిరిగి వచ్చిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ముంబై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు.;
Hardik Pandya : టీ-20 వరల్డ్ కప్ తర్వాత దుబాయి నుంచి తిరిగి వచ్చిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ముంబై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు. దాదాపు 5 కోట్ల ఖరీదైన రెండు వాచ్‌లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను ఎయిర్‌పోర్టులో ఆపిన కస్టమ్స్ ఆఫీసర్స్.....రెండు వాచీలకు సంబంధించి ఇన్‌వాయిస్ చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత ఏడాది ఐపీఎల్ 2020 తర్వాత తిరిగి ఇండియాకు వచ్చిన హార్దిక్ పాండ్యా అన్న కృనల్ పాండ్యా దగ్గర కూడా కస్టమ్స్ అధికారులు బంగారం గుర్తించిన విషయం తెలిసిందే.