ICC Test Rankings : పుజారా ఆరు..రహానె ఎనిమిది!

మంచి ఫామ్ ప్రదర్శించిన భారత ఆటగాళ్లు పూజారా (760), అజింక్య రహానె (748).. ఒక్కో స్థానం మెరుగుపడి 6, 8 స్థానాల్లో నిలిచారు.

Update: 2021-01-30 12:45 GMT

ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో మంచి ఫామ్ ప్రదర్శించిన భారత ఆటగాళ్లు పూజారా (760), అజింక్య రహానె (748).. ఒక్కో స్థానం మెరుగుపడి 6, 8 స్థానాల్లో నిలిచారు. విరాట్ కోహ్లీ (862) నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) (919), స్టీవ్ స్మిత్ (891)(AUS), లబుషేన్ (878) (AUS) వరుసగా టాప్-3లో ఉన్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (823) ఐదవ స్థానాన్ని నిలుపుకున్నాడు. వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ రిషబ్ పంత్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా 13, 18 స్థానాల్లో నిలిచారు. కాగా బౌలింగ్ విభాగంలో అశ్విన్(8), బుమ్రా(9) స్థానాల్లో కొనసాగుతుండగా.. కమిన్స్, బ్రాడ్ మొదటి రెండు ర్యాంక్‌ల్లో ఉన్నారు.


Tags:    

Similar News