Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా.. అయినా చెన్నైతో మ్యాచ్..

Delhi Capitals: తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఓ నెట్ బౌలర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

Update: 2022-05-09 01:37 GMT

Delhi Capitals: కోవిడ్ తీవ్రత తగ్గిపోయింది అనుకుంటున్న సమయంలోనే మరోసారి అది విజృంభిస్తూ.. ప్రజలను ఒణికిస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రజలే దీని నుండి జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కరోనా తీవ్రత తగ్గిపోవడంతో ఐపీఎల్ కూడా యథావిధిగా మొదలయ్యింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

గతేడాది ఐపీఎల్ జరగాల్సిన సమయానికి కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఐపీఎల్‌ను సెప్టెంబర్, అక్టోబర్‌కు పోస్ట్‌పోన్ చేశారు నిర్వహకులు. అయితే ఈసారి మాత్రం కోవిడ్ తీవ్రత తగ్గిపోయింది కాబట్టి ఎప్పటిలాగానే సమ్మర్‌లో దీని షెడ్యూల్‌ను ఫిక్స్ చేశారు. కానీ ఐపీఎల్ ప్రారంభమయినప్పటి నుండి ఆటగాళ్లకు, టీమ్ సభ్యులకు.. ఇలా ఎవరో ఒకరికి పాజిటివ్ వస్తూనే ఉంది.

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఓ నెట్ బౌలర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో టీమ్ సభ్యులంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. అయినా కూడా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ యథావిధిగా జరిగిపోయింది. దీనిపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌లో ముగ్గురు సహాయ సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడగా.. ఇంకా ఆ టీమ్‌తో మ్యాచ్‌లు నిర్వహించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News