IND vs ENG : విజయానికి 38 పరుగుల దూరంలో..
49 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది.;
పింక్ బాల్ టెస్టులో టీంఇండియా ఆదరగోడుతుంది. ఇంకా విజయానికి కేవలం 38 పరుగులు దూరంలో టీంఇండియా నిలిచింది. 49 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ 6, గిల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో స్టోక్స్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే.. రూట్ 19 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికట్లు, అశ్విన్ 4, సుందర్ ఒక వికెట్ తీశాడు.