విశాఖకు చెందిన యువ క్రికెటర్‌కు అద్భుత అవకాశం
జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో.. భరత్ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి.;
విశాఖకు చెందిన యువ క్రికెటర్‌కు అద్భుత అవకాశం లభించింది. మధురవాడకు చెందిన కోన శ్రీకర్ భరత్‌కు జాతీయ జట్టులో చోటు దక్కింది. ఫిబ్రవరి 5న చెన్నైలో జరిగే ఇండియా - ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు స్టాండ్ బైగా శ్రీకర్ భరత్ ఎంపికయ్యాడు. భరత్ ఎంపికతో విశాఖ క్రికెట్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మరోవైపు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వైజాగ్ క్రికెట్ అసోసియేషన్‌లు అభినందనలు తెలిపాయి. జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో.. భరత్ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి. బంధువుల, సన్నిహితులు వచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.