రికార్డు సృష్టించిన చెన్నై-ముంబై మ్యాచ్.. ఎంత మంది చూశారంటే?
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీజన్‌లోనూ ఆరంభ మ్యాచ్‌కు ఇంత వ్యూయర్‌షిప్ రాలేదట..;
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసిన ఐపీఎల్ పండుగ సెప్టెంబర్ 19 న ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా ఇండియన్ ప్రిమియర్ లీగ్ గ్రాండ్‌గా స్టార్ అయింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, హాట్ ఫేవరెట్ గతడేది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది.
కరోనా వైరస్ విజృంభణ.. లాక్‌డౌన్.. అన్‌లాక్‌డౌన్ అంటూ వినోదాలకు దూరమైన కోట్లాది మంది క్రికెట్ అభిమానులను ఈ మ్యాచ్ ఎంటైర్ టైన్ చేసేంది. ప్రేక్షకుల కేరింత లేకపోయినా.. చీర్‌గాళ్స్ చిందు లేకున్నా.. క్రికెట్ సందడి ఏమాత్రం తగ్గలేదు. ధనాధన్ సిక్సర్లు.. రివ్వున ఎగిరే వికెట్లు.. మెరుపు క్యాచ్‌లతో రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డాయి. క్లోజ్‌డ్ డోర్స్ మధ్య ప్రారంభమైన ఈ టోర్నీలోని తొలి మ్యాచ్ రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 19 న చెన్నై-ముంబై జట్ల మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో వీక్షించారట. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీజన్‌లోనూ ఆరంభ మ్యాచ్‌కు ఇంత వ్యూయర్‌షిప్ రాలేదట. ఈ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 20 కోట్ల మంది వీక్షించినట్టు బీసీసీఐ కార్యదర్శి జే షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, ప్రపంచంలో మరే లీగ్‌కూ ఇంతటి ఆదరణ దక్కలేదని పేర్కొన్నారు.
ఇక ఈ సీజన్‌లో సీఎస్‌కే అదిరే ఆరంభాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా చెలరేగిన సీఎస్‌కే టీమ్ డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు 5 వికెట్లతో ఘన విజయాన్నందుకుంది. ఏడాది తర్వాత మైదానంలోకి దిగిన ధోనీకి ఫర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్ దక్కింది.