ఐపీఎల్ 13వ సీజన్‌లో అత్యధికంగా 5 ట్రోఫీలు గెలిచిన జట్టుగా ముంబయి నిలిచింది. విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్ అరుదైన ఘనత సాధించాడు. లీగ్ ఫైనల్లో రెండు సార్లు అర్ధశతకం సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. 13వ సీజన్‌లో ఫెయిర్‌ప్లే అవార్డు ముంబయి దక్కించుకుంది. కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్, కగిసో రబాడ పర్పుల్ క్యాప్, దేవదత్ పడిక్కల్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులు అందుకున్నారు. పొలార్డ్ సూపర్ స్ట్రైకర్ అవార్డ్ గెల్చుకున్నాడు. అత్యంత విలువైన ఆటగాడిగా జోఫ్రా ఆర్చర్ నిలిచాడు.