IPL Media Rights: ఐపీఎల్ వేలంలో రికార్డ్.. రూ.40,075 కోట్లకు మీడియా హక్కులు..
IPL Media Rights: వచ్చే ఐదేళ్లపాటు ఐపీఎల్ టీవీ, డిజిటల్ హక్కులు 43వేల కోట్లు రికార్డు స్థాయి ధరకు అమ్ముడైంది.;
IPL Media Rights: ఐపీఎల్ వేలంలో బీసీసీఐకి కాసుల పంట పండింది. వచ్చే ఐదేళ్లపాటు ఐపీఎల్ మీడియా హక్కుల ప్రసారానికి బీసీసీఐ వేలం నిర్వహించగా.. టీవీ, డిజిటల్ హక్కులు 43వేల కోట్లు రికార్డు స్థాయి ధరకు అమ్ముడైంది. 2023 నుంచి 2027 కాలానికి గాను ముంబైలో బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహించింది. ఐపీఎల్ మీడియా హక్కుల కోసం మొత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించి వేలం నిర్వహించారు.
మొత్తం ఐదేళ్లకు కలిసి 370 మ్యాచులకు కలిపి 43వేల 255 కోట్ల వద్ద బిడ్డింగ్ క్లోజ్ అయ్యింది. టీవీ ప్రసార హక్కులను సోనీ 23వేల 575 కోట్లకు దక్కించుకోగా.. డిజిటల్ ప్రసార హక్కులు వయాకామ్ 18.. 20వేల 500 కోట్లకు సొంతం చేసుకుంది. దీని ప్రకారం ఒక్కో మ్యాచ్ డిజిటల్ ప్రసార హక్కులు 50 కోట్లు కాగా.. ఒక్కో మ్యాచ్ టీవీ ప్రసారాలు 57 కోట్ల విలువ చేయనుంది.