IPL2023 కప్ చెన్నైదే..
IPL ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది;
IPL ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఐదోసారి టైటిల్ గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన చివరి బంతికి విజయం సాధించింది. చివరి ఓవర్ లో 13 రన్స్ కావాల్సి ఉండగా ... తొలి నాలుగు బంతుల్లో మూడే పరుగులు రావడంతో ఉత్కంఠ ఏర్పడింది. ఈ తరుణంలో చెన్నై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతం చేశాడు. వరుసగా సిక్స్, ఫోర్ బాదడంతో చెన్నై విజయం సాధించింది.
వర్షం అంతరాయం కలిగించడంతో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై జట్టులో కాన్వే, శివమ్ దూబె, రహానె, రుతురాజ్ రాయుడు రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్, సాహా, గిల్ చెలరేగి ఆడారు.