Jhulan Goswami : తొలి బౌలర్‌గా ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు ..!
Jhulan Goswami : భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు సృష్టించింది. వన్డేల్లో 250 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్‌గా నిలిచింది.;
Jhulan Goswami : భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు సృష్టించింది. వన్డేల్లో 250 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఝులన్ గోస్వామి ఈ మైలురాయిని చేరుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్ బీమౌంట్‌ను అవుట్ చేసి గోస్వామి ఈ ఘనత సాధించింది. కాగా 198 ఇన్నింగ్స్‌లో ఆమె ఈ ఘనత సాధించడం విశేషం.. ఇక వన్డేల్లో 250 వికెట్ల మైలురాయిని అందుకున్న ఏడో భారత బౌలర్(పురుషులు, మహిళా క్రికెటర్లు కలిపి)గా నిలిచింది. ఆమె తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ క్యాథరిన్ ఫిట్జ్‌పాట్రిక్ మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 180 వికెట్లతో రెండో స్థానంలో ఉంది.