ఐపీఎల్‌లోకి కడప కుర్రాడు.. ధోనితో కలిసి.. !
బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్‌లో ఆడే అవకశాన్ని దక్కించుకున్నాడు కడప కుర్రాడు మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి.;
బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్‌లో ఆడే అవకశాన్ని దక్కించుకున్నాడు కడప కుర్రాడు మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి.. 2021 ఐపీఎల్ సీజన్‌లో భాగంగా నిన్న (గురువారం) నిర్వహించిన వేలంలో ఈ యువకుడిని రూ.20 లక్షలకి చెన్నై ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఈమేరకు చెన్నై జట్టు యాజమాన్యం ట్వీట్ చేసింది. దీనితో ధోని, సురేష్ రైనా లాంటి హేమాహేమీలతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోనమల పంచాయతీ నాగూరువాండ్లపల్లెకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డికి 22ఏళ్ళు.. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. కాగా ఇది వరకే కడప నుంచి పైడికాల్వ విజయ్ కుమార్‌కు కూడా ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభించిన విషయం తెలిసిందే.