Kane Williamson: కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం
కెప్టెన్సీ వదిలేసిన కేన్, సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా;
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీ వదిలేసిన కేన్.. వన్డే, టీ20 సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అంతేకాదు 2024-25 సీజన్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా తిరస్కరించాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. టీ20 ప్రపంచకప్ 2024లో కివీస్ ఘోర వైఫల్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ సిలో ఉన్న కివీస్.. తొలి రెండు మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ చేతిలో ఓడింది. తర్వాత చిన్న జట్లయిన ఉగాండా, పాపువా న్యూగినిలపై నెగ్గింది. అయినప్పటికీ న్యూజిలాండ్ సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది.