Virat Kohli : కోహ్లీకి బీసీసీఐ క్రేజీ ఆఫర్.. కానీ నో చెప్పిన విరాట్..!
Virat Kohli : టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఇటీవల విరాట్ కోహ్లీ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.;
Virat Kohli : టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఇటీవల విరాట్ కోహ్లీ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి ముందు అంటే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందు ఓ పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో మరింత హాట్ టాపిక్‌గా మారింది. టెస్ట్ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోవడానికి ముందు బీసీసీఐ కోహ్లికి ఓ ఆఫర్ వచ్చిందట.
తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే 100వ టెస్ట్ మ్యాచ్‌కు సారధిగా వ్యవహరించిన తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలిగే అంశాన్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐ ప్రతినిధి ఒకరు కోహ్లిని కోరాడట. అయితే ఈ ఆఫర్ ని కోహ్లీ సున్నితంగా తిరస్కరించాడట. తనకి మొదటి మ్యాచ్ అయినా.. వందో మ్యాచ్ అయిన ఒకటేనని, తనకి ఎలాంటి ఫేర్‌వెల్ టెస్ట్ అవసరం లేదని కోహ్లీ చెప్పినట్టుగా తెలుస్తోంది.
కాగా వచ్చే నెలలో(ఫిబ్రవరి 25-30) శ్రీలంకతో జరగబోయే తొలి టెస్ట్ ద్వారా వంద టెస్ట్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు కోహ్లీ.. ఈ టెస్ట్‌కు బెంగళూరు వేదిక కానుంది. ఇక మొత్తం 68 టెస్ట్‌ల్లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లి.. అందులో 40 మ్యాచ్‌ల్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు.