Mithali Raj: మిథాలీ రాజ్ రికార్డ్.. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో..
Mithali Raj: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బ్యాట్ మూగబోయింది;
Mithali Raj (tv5news.in)
Mithali Raj: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బ్యాట్ మూగబోయింది కానీ.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడంలో మాత్రం సత్తా చాటింది. ఈ రికార్డు గతంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ క్రీడాకారిణుల పేరిట ఉండగా.. తాజాగా మిథాలీ ఈ లిస్టులో అగ్రస్థానికి చేరింది. ఇంతకీ ఆ వరల్డ్ రికార్డ్ ఏంటంటే.. అత్యధిక ప్రపంచకప్ లు ఆడిన మహిళా క్రీడాకారిణిల గురించి.
ప్రపంచకప్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్ తో అత్యధిక వన్డే ప్రపంచకప్‌లు ఆడిన ప్లేయర్‌గా మారింది మిథాలీ రాజ్. ఇది ఆమెకు ఆరో ప్రపంచకప్. ఇన్ని ప్రపంచకప్‌లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రికార్డులకెక్కింది. కానీ మిథాలీ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్‌తో సత్తా చాటలేకపోయింది. పాకిస్థాన్‌పై 36 బంతులు ఎదుర్కొన్న ఆమె 2 ఫోర్ల సాయంతో 9 పరుగులు మాత్రమే చేయగలిగింది.