Mithali Raj: మిథాలీ రాజ్ రికార్డ్.. హాఫ్ సెంచరీలతో..
Mithali Raj: తాజాగా మిథాలీ మరో రికార్డును సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.;
Mithali Raj (tv5news.in)
Mithali Raj: క్రికెట్ అంటే చాలామంది స్పోర్ట్స్ లవర్సకు ఇష్టం. కానీ ఎందుకో పురుషుల క్రికెట్ టీమ్‌కు వచ్చినంత గుర్తింపు మహిళల క్రికెట్ టీమ్‌కు రాలేకపోయింది. అయినా కూడా మహిళా క్రికెటర్లు ఎక్కడా నిరుత్సాహపడకుండా భారత్‌కు ఎన్నో పతకాలు తీసుకొచ్చారు. తాజాగా ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ ఓ రికార్డ్ సృష్టించి మరోసారి అందరినీ అభిమానులను చేసుకుంది.
ఇప్పటికే మహిళల క్రికెట్ జట్టు ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకుంది. అందులో కొన్ని రికార్డులు మిథాలీ రాజ్ పేరు మీద కూడా ఉన్నాయి. అయితే తాజాగా మిథాలీ మరో రికార్డును సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత కొంతకాలంగా మిథాలీ ఫామ్‌లేమి అనే వ్యాధితో బాధపడుతోంది. అందుకే 2022 వరల్డ్ కప్ బిగినింగ్‌లో కూడా తన ప్రదర్శన అంతగా మెప్పించలేకపోయింది. ఇక తాజాగా వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ ప్రదర్శన విమర్శకుల నోళ్లు మూయించింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 77 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది మిథాలీ రాజ్. దీంతో మహిళా ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీపైన స్కోర్ చేసిన క్రికెటర్స్‌గా రికార్డ్ సృష్టించింది. అయితే ఇది మిథాలీ రాజ్ కెరీర్‌లో 63వ హాఫ్ సెంచరీ కావడం మరొక విశేషం. మరోసారి మిథాలీ తన ఆటతో అందరి చూపును తనవైపు తిప్పుకుంది.