'చిట్టితల్లి ఐ మిస్ యూ' అంటున్న మహ్మద్ షమీ
టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ తన గారాల పట్టి ఐరా గురించి ఎమోషనల్‌గా మాట్లాడాడు. ఐరాను చూడకుండా చాలా రోజులైందని..;
టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ తన గారాల పట్టి ఐరా గురించి ఎమోషనల్‌గా మాట్లాడాడు. ఐరాను చూడక చాలా రోజులైందని.. చిట్టితల్లిని చాలా మిస్ అవుతున్నానని అన్నారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ ఐపీఎల్ 13వ సీజన్‌లో ఆడేందుకు దుబాయ్ వెళ్లారు. శనివారం పీటీఐతో జరిగిన ఇంటర్వ్యూలో షమీ తన కూతురు ఐరాకు గురించి మాట్లాడారు. లాక్‌డౌన్ సమయం నుంచే ఐరాను మిస్ అవుతున్నానని తెలిపారు. మరో రెండు వారాలు తనను చూడకుండా ఉండాల్సి ఉంటుందని అన్నారు. కాగా షమీ భార్య హసీన్ జహాన్ అతడిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అక్రమ సంబంధాలు కలిగి ఉండటంతో పాటు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తన కూతురితో కలిసి వేరుగా జీవిస్తోంది.