Rahul Dravid: రవి శాస్త్రి ఔట్.. రాహుల్ ద్రవిడ్ ఇన్..
Rahul Dravid: టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పేరు దాదాపుగా ఖరారైంది.;
Rahul Dravid (tv5news.in)
Rahul Dravid: టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పేరు దాదాపుగా ఖరారైంది. కోచ్‌గా ద్రవిడ్‌ను ఖరారు చేసినట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే, రాహుల్ ద్రవిడ్ పేరును బీసీసీఐ అఫీషియల్‌గా ప్రకటించలేదు. చీఫ్ కోచ్‌గా ఉండేందుకు రాహుల్ ద్రవిడ్ ముందు నుంచి ఒప్పుకోవడం లేదు. అయితే, నిన్న చెన్నై, కోల్‌కతా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన తరువాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా ద్రవిడ్‌తో చర్చలు జరిపారు. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు ద్రవిడ్‌ను ఒప్పించారు.
ప్రస్తుతం టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నారు. నవంబర్ 14తో రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తుంది. టీ-20 వరల్డ్ కప్ ముగిసిన తరువాత రవిశాస్త్రి రిటైర్ అవుతున్నారు. త్వరలో న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు చాలా సిరీస్‌లు ఉన్నాయి. పైగా రెండేళ్లలోనే వరల్డ్‌కప్ రాబోతోంది. దీంతో కొత్త కోచ్‌పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలనుకుంది బీసీసీఐ. ఇందులో భాగంగానే రాహుల్ ద్రవిడ్‌ను ఒప్పించి, కోచ్‌గా నియమించబోతోంది బీసీసీఐ.
న్యూజిలాండ్ సిరిస్ కోసం రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా నియమిస్తారని మొదట భావించారు. అయితే, పూర్తిస్థాయి కోచ్‌గానే రాహుల్‌ను నియమించాలనే నిర్ణయానికొచ్చింది బీసీసీఐ. 2023లో జరిగే వరల్డ్‌కప్ వరకు టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా, ఇండియా-A టీమ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు ద్రవిడ్. శ్రీలంకలో పర్యటించిన టీమిండియాకు రాహుల్ ద్రవిడే కోచ్‌గా ఉన్నారు.