Rashid Khan: క్రికెట్‌లోకి కొత్త షాట్.. రషీద్ ఖాన్ నో లుక్ సిక్స్ వైరల్..
Rashid Khan: రషీద్ ఖాన్ మణికట్టును ఉపయోగించి బంతిని బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్‌ను కొట్టాడు.;
Rashid Khan (tv5news.in)
Rashid Khan: క్రికెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త షాట్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. చాలామంది సీనియర్ క్రికెటర్లు కొత్త షాట్స్‌ను క్రియేట్ చేసి హిస్టరీ క్రియేట్ చేశారు. గత కొంతకాలంగా ఉన్న యంగ్ క్రికెటర్లు అందరూ పాత షాట్స్‌నే వారి స్టైల్‌లో ఆడుతూ క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు. తాజాగా ఓ పాకిస్థానీ క్రికెటర్ కొట్టిన కొత్త షాట్ ప్రస్తుతం క్రికెట్ వరల్డ్‌లో వైరల్ అవుతోంది.
సిక్స్‌లు కొట్టడంలో ఒక్కొక్క క్రికెటర్‌కు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ ఒక్కొక్క స్టైల్‌కు సెపరేట్ ఫ్యా్న్‌బేస్ ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్ట్‌లోని సిక్సర్స్‌లో రషీద్ ఖాన్ నో లుక్ సిక్స్ కూడా చేరింది. ప్రస్తుతం క్రికెటర్లంతా ఈ షాట్ గురించే మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ నడుస్తోంది. ముల్తాన్ సుల్తాన్స్, లాహోర్ ఖలందర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ బ్యాటింగ్ చేస్తుండగా షానవాజ్ దహానీ బౌలింగ్ చేశాడు. దహానీ వేసిన 137.1 కిలోమీటర్ల స్పీడ్‌తో ఉన్న బంతిని రషీద్ ఖాన్ బౌండరీ దాటించాడు.
రషీద్ ఖాన్ మణికట్టును ఉపయోగించి బంతిని బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్‌ను కొట్టాడు. బంతి బౌండరీ దాటిన తర్వాతే రషీద్ ఖాన్ తల పైకెత్తి చూశాడు. దీనికి నో లుక్ సిక్స్ అనే పేరు పెట్టుకున్నారు.