Ravi Shastri: 'విరాట్ ఐపీఎల్ నుండి తప్పుకోవడం మంచిది'.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

Ravi Shastri: రవిశాస్త్రి కూడా విరాట్ ఐపీఎల్ నుండి తప్పుకోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Update: 2022-04-28 02:15 GMT

Ravi Shastri: క్రికెట్ లవర్స్‌లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజే వేరు. తనను తన అభిమానులంతా ప్రేమగా కింగ్ కోహ్లీ అని కూడా పిలుచుకుంటారు. కానీ ప్రస్తుతం కింగ్ కోహ్లీ ఫార్మ్‌లో లేడు. తన ఆటను పూర్తిస్థాయిలో ప్రేక్షకులు చూసి చాలాకాలం అయ్యింది. ఇక ఐపీఎల్ 2022లో కోహ్లీ పర్ఫార్మెన్స్‌కు నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ) టీమ్ ఒక్కసారైనా ఐపీఎల్ కప్ గెలిస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తు్ంటారు. అయితే ఈసారి ఆర్‌సీబీ పర్ఫార్మెన్స్ కాస్త పరవాలేదు అనిపించినా.. కోహ్లీ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు బాలేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా రవిశాస్త్రి కూడా విరాట్ ఐపీఎల్ నుండి తప్పుకోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

రవిశాస్త్రి ఇటీవల ఓ ఇంటర్వ్యలో పాల్గొన్నాడు. కొన్నేళ్లుగా టీమిండియాకు పలు ఫార్మాట్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడని గుర్తుచేసుకున్నాడు రవిశాస్త్రి. అందుకే తనకు విరామం చాలా అవసరమని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మరికొన్నేళ్లు కోహ్లీ తన సత్తా చాటాలనుకుంటే ఐపీఎల్ నుండి తప్పుకోవడం మంచిది అన్నాడు రవిశాస్త్రి. అంతే కాకుండా విరాట్‌కు మాత్రమే కాకుండా ఇతర ఆటగాళ్లకు కూడా అదే చెప్తానంటూ షాక్ ఇచ్చాడు.

Tags:    

Similar News