Ravindra Jadeja: టీమిండియాకు బ్యాడ్ న్యూస్..! టెస్ట్ క్రికెట్‌కు దూరమవ్వనున్న రవీంద్ర జడేజా?
Ravindra Jadeja: టీమిండియాలో ఇప్పటికే ఎన్నో ఊహించనవి జరుగుతూ.. ప్లేయర్స్‌ను ఒకరికి ఒకరిని దూరం చేస్తున్నాయి.;
Ravindra Jadeja (tv5news.in)
Ravindra Jadeja: టీమిండియాలో ఇప్పటికే ఎన్నో ఊహించనవి జరుగుతూ.. ప్లేయర్స్‌ను ఒకరికి ఒకరిని దూరం చేస్తున్నాయి. సౌతాఫ్రికా టెస్ట్‌లో టీమ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని భయపడుతుండగానే.. ఇంతలోనే టీమిండియా ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్ వినిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో ప్లేయర్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడని టాక్ వినిపిస్తోంది.
టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మను కెప్టెన్ చేసినప్పటి నుండి రోహిత్‌కు, విరాట్‌కు మాటల్లేవు. వీరిద్దరిలో ఎవరూ దీనిపై స్పందించడానికి సిద్ధంగా లేరు. వీరు మాత్రమే కాదు.. టీమ్‌లో ఎవరూ కూడా దీనిపై స్పందించాలి అనుకోవట్లేదు. ఇదిలా ఉండగా విరాట్ టీ20 నుండి తప్పుకుంటాడన్న రూమర్స్ కూడా మొదలయ్యాయి. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోక ముందే మరో క్రికెటర్ క్విట్టింగ్ గురించి కూడా రూమర్స్ వినపిస్తున్నాయి.
టీమిండియాలోని ఆల్ రౌండర్లలో ఒక పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఇప్పటికే తన పర్ఫార్మెన్స్‌తో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న జడ్డూ.. టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇటీవల న్యూజిలాండ్ టెస్ట్ సమయంలో జడ్డూ గాయపడ్డాడు. అందుకే త్వరలో జరగనున్న సౌతాఫ్రికా టెస్టులో తాను టీమ్‌లో లేడు.
రవీంద్ర జడేజాకు తగిలిన గాయం మానిపోవాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని వైద్యులు అన్నారు. అయితే గాయం పూర్తిగా తగ్గిన తర్వాత కూడా తాను టెస్ట్ క్రికెట్ వైపు వెళ్లకూడదని జడ్డూ నిర్ణయించుకున్నట్టు సమాచారం. టీ20, వన్డేలో ఎక్కువకాలం కొనసాగడానికి జడ్డూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా వదంతులు వినిపిస్తున్నాయి.